18-08-2025 12:00:00 AM
పొంగిపొర్లుతున్న జలాల్పూర్ (సైదుపూర్ రిజర్వాయర్), బొప్పాపూర్ (గుండ్లవాగు)
లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ ఆగస్టు 17 (విజయ క్రాంతి) : నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అని నిజామాబాద్ సిపి సాయి చైతన్య అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జలల్ పూర్ లో గల సైద్ పూర్ రిజర్వాయర్,రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్ లో గుండ్ల వాగు ను పొంగి పొర్లుతున్న సందర్బంగా లో లెవెల్ వంతెన పైనుంచి పొంగిపొర్లుతున్న వరద జలాలను పరిశీలించారు. అత్యవసర సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్: 8712659700 నెంబర్ తో సంప్రదించాలని ప్రజలకు తెలిపారు.ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, రుద్రూర్ సీఐ శ్రీ ఆర్ కృష్ణ , వర్ని ఎస్‌ఐ శ్రీ యు. మహేష్ , రుద్రూర్ ఎస్సు శ్రీ సాయన్న , వర్ని ఎంపీడీవో శ్రీ జి. వెంకటేష్ తదితరులు ఉన్నారు.