27-07-2025 10:04:02 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): శ్రావణ మాసం ఆదివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం(Sri Raja Rajeshwara Swamy Devasthanam)లో భక్తుల రద్దీ కనీవినీ ఎరుగని విధంగా కనిపించింది. సాయంత్రం 6:00 గంటల వరకు స్వామివారిని 32,509 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక అధికారిణి రాధాబాయి మాట్లాడుతూ.. శ్రావణ మాసం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు అందేలా దేవస్థానం ఏర్పాట్లు చేపట్టిందనీ, భక్తులు భద్రతా నిబంధనలు పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలియజేశారు.