28-07-2025 12:14:03 AM
బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్
నల్లగొండ టౌన్, జులై 27 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుండి బరిలో ఉంటామని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ అన్నారు. ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల మండల పార్టీ అధ్యక్షులు వంగూరు రవి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ మండల ంలో రేపు జరగబోయే జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి ఒక్క ఎంపీటీసీకి జడ్పిటిసిగా పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని వారికి అండదండగా ఉంటానని అన్నారు. ప్రతి ఒక్కరూ పోటీలో ఉండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని కార్యకర్తలను సూచించడం జరిగిందన్నారు.
జిల్లా కౌన్సిల్ నెంబర్ పల్లె ప్రకాష్, మండల ప్రధాన కార్యదర్శులు నకరికంటి మహేష్, గంగాధర్, సుంకరబోయిన యాదగిరి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి పగిడోజు బ్రహ్మచారి, వడ్డే శ్రీనివాసరెడ్డి, దాసరి నాగరాజ్, తంగెళ్ల సాయికిరణ్ రెడ్డి, మండల కోశాధికారి గంటకంపు నాగరాజు, వల్లెం మాధవరెడ్డి, ఎల్లంల శ్రీనివాస్ రెడ్డి, కుపాకుల దాసు, బీజేవైఎం మండల అధ్యక్షులు దేశాలు శివశంకర్, మర్రి రామకృష్ణ, గుండు శ్రీకాంత్, పాప కంటి సతీష్, బత్తిని మహేష్, మైనం మల్లయ్య, పేరం జోగేందర్, మామిడి నాగరాజు, మామిడి సందీప్, మేడపైన లింగస్వామి, పాపసాని శివ చంద్రు, శివ తదితరులు పాల్గొన్నారు.