28-07-2025 12:12:06 AM
-ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ వెల్లడి
- రెండు రోజులుగా జిల్లాలో విస్తృతంగా తనిఖీలు
ఆదిలాబాద్, జూలై 2౭ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆబ్కారీ శాఖ రాష్ట్ర కమిషనర్ హరికిరణ్ ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గుడిహ త్నూర్, బోథ్ మండలాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి ఆదివారం పలు ఆసుపత్రు లను, పిఎసిఎస్ సెంటర్ లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇందులో భాగంగానే గుడిహత్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, గోదాం లను ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సందర్శించి పీఏసీఎస్ కేంద్రాల్లో అమలవుతున్న ఆన్లైన్ పేమెంట్ విధానం, ఎరువుల నిల్వలు, పంపిణీ తదితర అంశాలపై అరా తీశారు. పీఏసీఎస్, ఏఆర్‌ఎస్‌కే వంటి దుకాణాల్లో సరిపడా ఎరువుల నిల్వలు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ఎరువుల దుకాణంలో గత వారపు సగటు అమ్మకాలను ఆధారంగా చేసుకుని రానున్న నాలుగు రోజుల అవసరాన్ని గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసు కోవాలని సూచించారు. రైతులకు ఎటువం టి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఈ మెషీన్‌ల ద్వారా ఎరువుల అమ్మకాల వివరాలను తన ఆధార్ కార్డుతో స్వయంగా పరిశీలించారు.
సాంకేతికత వినియోగం ద్వారా వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తున్న పీఏసీఎస్ సిబ్బంది పనితీరును ఆయన ప్రశంసించారు. అనంతరం బోథ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, వార్డులను పరిశీలించారు. అనారోగ్యంతో చికిత్స పొం దుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రత్యేక వైద్యం అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారి ఆదేశాల మేరకు 3 సంవత్సరాల చిన్నారి స్వీటీని బోథ్ పీహె చ్‌సీ నుండి అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించాల న్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, మందుల నిల్వలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైన మందుల ఇండెంట్లను సమయానికి పంపి స్తూ సేవలలో అంతరాయం లేకుండా చూ డాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని, డీసీఓ మోహన్, డీఏఓ శ్రీధర్ స్వామి, తహసీల్దార్ కవిత, డి.ఎం అండ్ హెచ్.ఓ నరేందర్ రాథోడ్, అదనపు డి.ఎం అండ్ హెచ్.ఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.