calender_icon.png 28 July, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతి అభివృద్ధే అంతిమ లక్ష్యం

28-07-2025 12:13:49 AM

- అన్ని వ్యవస్థలపై బీజేపీ దాడి...

- మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు

ఆదిలాబాద్, జూలై 2౭ (విజయక్రాంతి): జాతి కోసం... ఆదివాసుల అభివృద్ధి కోసం కృషి చేస్తూనే, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. ఆదిలా బాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ లో ఆదివారం కార్యక్రమంలో పెద్దఎత్తున ఆదివాసీలు పాల్గొన్నారు.

ముందుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీల సాం ప్రదాయ  వాయిద్యాలతో సభ ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. ఆదివాసీల ఆరాధ్యదైవం కొమురం భీం, దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా సోయం బాపురావు ప్రమాణ స్వీకారం చేశా రు. ఈ సందర్బంగా సోయం బాపురావు మాట్లాడుతూ గతంలో తాను వేరే పార్టీలో ఉన్నప్పటికి మరో పార్టీ నుంచి పోటీ చేసిన బొజ్జు పటేల్ గెలవాలని కోరుకున్నానని చెప్పారు. తనకు, మాజీ ఎమ్మెల్యే సక్కుకు టికెట్ సమస్య వచ్చినప్పుడు ఆయనకే ఇవ్వాలని సూచించానని పేర్కొన్నారు. కొందరు నాపై విమర్శలు చేస్తున్నారని, కానీ నేను ప్రస్తుతం వారి జోలికి వెళ్లానని తెలిపారు.

దేశంలోని అన్ని వ్యవస్థలపై బీజేపీ దాడి చేస్తోందని దానిని అడ్డుకోవడానికే రాజ్ గోండు సేవా సమితికి అధ్యక్షులుగా అయ్యానని వివరించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కుట్రలు పన్ని జీవో 49 తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ జీవో రద్దు కోసం రాబోవు రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ఆదివాసులకు అన్యాయం జరిగితే ఆస్తులను అమ్మి అయిన ఉద్యమిస్తానని చెప్పారు. నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించేందుకు సీఎం తో మాట్లాడుతానని చెప్పారు.

అర్హులైన అం దరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మంచిగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అంతకుముందు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. రాజ్ గోండు సేవా సమితి బలోపేతం కోసమే సోయం బాపురావుకు అధ్యక్ష పదవి లభించిందని, ఆదివాసులందరిని ఏక తాటి పై తీసుకురావాలన్నారు.  సోయంపై విమర్శలు చేయడం మంచిది కాదని తెలిపారు.

గత ప్రభుత్వంలో ఆదివాసులకు ఎలాంటి న్యాయం జరగలేదని, సీఎం రేవంత్‌రెడ్డి మనవైపు ఉన్నారని న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఆదివాసీ సమాజం కోసం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, గ్రంథాలయం సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, గజేందర్, ఆత్రం సుగుణ, శ్రీకాంత్‌రెడ్డి, గణేష్ రెడ్డి, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.