06-10-2025 12:33:36 AM
కుటుంబ సమేతంగా దర్శించుకున్న శివధర్‌రెడ్డి
యాదగిరిగుట్ట, అక్టోబర్ 5 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వామిని డీజీపీ శివధర్‌రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. శివధర్‌రెడ్డికి అర్చకులు స్వాగతం పలికారు.
అనంతరం స్వామి వారి ప్రసాదం, వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని, ప్రత్యేక అనుభూతి కలిగిందని డీజీపీ దంపతులు తెలిపారు. డీజీపీ వెంట యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఉన్నారు.