18-12-2025 12:34:30 AM
భద్రాచలం, డిసెంబర్ 17, (విజయక్రాంతి): వృద్ధాప్యంలో ఏ విధమైన ఆదాయం లేకుండా కష్టాలు పడి పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రూపంలో భద్రత కల్పించిన ఆరాధ్యుడు డిఎస్ నకారా అని భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో డివిజన్ కమిటీ పింఛన్దారుల సమావేశంలో ఘనంగా నివాళులు అర్పించారు.
సంఘం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పింఛన్దారుల కోసం ఎన్నో పోరాటాలు చేసి సుప్రీంకోర్టు ద్వారా విజయం సాధించి పింఛన్దారులకు పెన్షన్ అమలు చేయించిన ఘనత నకారాదేనని అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి సహాయ కోశాధికారి నాళం సత్యనారాయణ గౌరవ సలహాదారు మాదిరెడ్డి రామ్మోహనరావు సహాయ కోశాధికారి నాళం సత్యనారాయణ సాహద్యక్షులు శివప్రసాద్ జి మురళీకృష్ణ కార్యదర్శి ఐవి వి సత్యనారాయణ నాయకులు సూరిశెట్టి కృష్ణ బన్సీలాల్ టీ దాసు కన్నయ్య లాల్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పిస్తూ చిత్రపటానికి పూలు చల్లారు.