18-12-2025 12:33:11 AM
బూర్గంపాడు,డిసెంబర్ 17,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల విద్యావనరుల కేంద్రంలో నాగమణి అటెండర్ గా గత 15 సంవత్సరాలు గా సర్వీస్ చేస్తున్నారు. గత నెలలో విధి నిర్వహణలో భాగంగా ఆఫీస్ కి వస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఆక్సిడెంట్ అయింది. బుధవారం టీఎస్ ఎస్ యు ఎస్ జిల్లా కమిటీ తరుపున మెసెంజర్ నాగమణికి రూ.31,000/- ఆర్ధిక సహాయం అందజేశారు.
మెసెంజర్ నాగమణి ని ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ తరుపున కోరారు.నాగమణి కి సహాయం చేసిన ప్రతీ ఒక్కరికీ జిల్లా కమిటీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చందు భట్టు,ప్రధాన కార్యదర్శి సిద్దు,మహిళా అధ్యక్షురాలు తులసి,నాయకులు మోహన్,రామకృష్ణ, కుమారి,నరేష్ పాల్గొన్నారు.