calender_icon.png 2 July, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతికి అడ్డాగా ధర్మవరం ఇసుక క్వారీ

16-06-2025 02:23:29 AM

- ఒడ్డు పైన పట్టా ల్యాండ్, తవ్వకాలు గోదావరిలో...?

- పట్టా ల్యాండ్ ప్రాంతాన్ని ప్రభుత్వ నిషిద్ధ ప్రాంతంగా  ప్రైవేట్ సైన్యంతో అడ్డగింత

- భాయ్ అనుభవంతో రెవెన్యూ, మైనింగ్ అధికారులకు చెక్ 

వాజేడు, జూన్ 15, (విజయ క్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ధర్మవరం పట్టా ల్యాండ్ ఇసుక క్వారీ అవినీతికి అడ్డగా మా రింది. ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ.. ఇసుక జాతర జరుగుతున్న వైనం ధర్మవరం గ్రామం లో భాయ్ కనుసనల్లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ సహజ వనరు అయిన ఇసుక దోపిడీ రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతుంది. గ్రామంలో గల కొంతమంది రైతుల పేర్లతో అనుమతులు పొంది పట్టల్యాండ్ ఇ సుక ర్యాంపు ప్రారంభించారు.

అయితే పట్టాదారుల యొక్క సర్వే నెంబర్లకు ఇసుక త్రవ్వే ప్రాంతా సర్వే నెంబర్లకు పొంతనే లేకుండా ప్రభుత్వ అనుమతులను అధిగమిస్తూ, ఇష్టానుసారంగా త్రవ్వకాలు జరుగుతున్నాయి. ఇంత అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పట్టా ల్యాండ్ ఏరియాకు ఎవరిని వెళ్ళనీయకుండా నిషిద్ధ ప్రాంతంగా మార్చి ప్రైవేట్ సైన్యంతో అడ్డగించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. లారీల పట్టా కూలీలలో భాయ్ యొక్క అనుచరులను చేర్చి పరిశీలనకు వెళ్లిన అధికార పార్టీ రాజకీయ నాయ కులను మినహాయిస్తే, ప్రజాసంఘాల నా యకుల,  మిగతా రాజకీయ నాయకుల పై సైతం దాడులకు సిద్ధం చేసి ఉంచడం గమనార్హం.

ఆ క్వారీలో కొంతమంది రైతులకు తె లియకుండానే వారి పట్టా ల్యాండ్ లో ఇ సుక పరిమిషన్లు వచ్చినాయి అంటే అక్కడ అవినీతి ఎంత జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గోదావరి వరదలలో మునిగిపోయి న రైతులకు న్యాయం చేయకూర్చడం కోసం పట్టా భూములలో తమ ఇసుకను అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతులు జారీ చే యడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది కాంట్రాక్టర్లు, రై తులకు వేల రూపాయలతో ఒప్పందం కు దుర్చుకొని కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత జరుగు తున్న స్థానిక మండల రెవెన్యూ అధికారులు గానీ, టీఎస్‌ఎండిసి మైనింగ్ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదంటే భా య్ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. 

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక తవ్వకాలు.

రైతుల పట్టా భూములలో ఇసుక మేటలను తొలగించుటకు, దీని ద్వారా రైతులకు ఆర్థిక ప్రోత్సాహం కొరకు ఏజెన్సీ ప్రాం తంలో నిబంధనల ప్రకారం ఎల్ టి ఆర్ చ ట్టాలను అనుసరిస్తూ మైనింగ్ అధికారులు అనుమతులు జారీ చేయడం జరుగుతుంది. అనుమతుల ప్రకారం వాతావరణ సమతుల్యత, భూగర్భ జలాలు ఇంకిపోకుండా మూ డు మీటర్లకు మించి తవ్వరాదనే నిబంధన లు ఉంటాయి. కానీ ఇక్కడ పట్టాదారుల పేరుతో నిర్వహిస్తున్న ధర్మారం ఇసుక క్వారీ లో ఆ నిబంధనలు అధికమిస్తూ ఇష్టానుసారంగా త్రవ్వకాలు జరుగుతున్నాయి.

గత కొ ద్ది రోజుల క్రితం ప్రజా సంఘాలు అక్కడికి వెళ్లి జరుగుతున్న అక్రమ తవ్వకాలపై ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న ఇటు రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు, టి ఎస్ ఎం డి సి అధికారులు గానీ, స్పందించకపోవడంతో ప్రజలలో భిన్న ఆలోచనలు ఉద్భవి స్తున్నాయి. అధికారులు మామూలు మత్తు లో ఉన్నారా?? అనే ప్రశ్న బహిర్గతం అవుతుంది. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని నిబంధనల ప్రకారం ఇసు క తవ్వకాలను జరిపించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. 

రైతులను మోసం చేస్తూ ఇసుక వ్యాపారం చేయడంలో బాయ్ ది అందవేసిన చేయి. 

గత 20 సంవత్సరాలుగా ధర్మవరం, చిం తూరు, ఆర్లగూడెం, లక్ష్మీనగరం గ్రామాలలో గల రైతుల యొక్క పట్టా భూములను సేకరించి వారికి లక్షలు చెల్లిస్తానని నమ్మబలికి చివరకు మొండి చేయి చూపించి కోట్లకు పడగలెత్తిన ఘనత చరిత్ర భాయ్ కి ఉంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. త ప్పుని ఒప్పుగా చెప్పించడంలో మంచి నేర్ప రి. అదే అనుభవంతో ధర్మవరం ఇసుక క్వా రీలో అధికారులకు ముడుపులతో చెక్ పెట్టి ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ప్రజలు బహిర్గతంగానే మాట్లాడుకుం టున్నారు. ఇకనైనా భాయ్ కనుసన్నల్లో జ రిగే అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులు దృష్టి సారించాలని అక్కడి పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు.