16-06-2025 02:23:06 AM
కేంద్రమంత్రి జయంత్‌సింగ్‌కు ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ విన్నపం
ముషీరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్స హించడం ద్వారా సమాజ ఆరోగ్యాన్ని, భూమి సారాన్ని కాపాడాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ విన్నవించింది. ఆదివారం హైదరాబాద్‌లోని కవాడిగూడకు వచ్చిన ఆయన్ను కలిసి వినతిపత్రం అందించింది.
ఈ సందర్భంగా కౌన్సిల్ అధ్యక్షుడు ఎస్‌సీహెచ్ రంగయ్య, జాతీయ సలహాదారు డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సేంద్రియ - ప్రకృతి వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి రసాయన వ్యవసాయ విధానాల వల్ల భూమి సారం తగ్గిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్ తరాలకు భూమి మీద జీవించడానికి ప్రమాద కర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ, పట్టణ, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, సబ్సిడీలు అందించాలని పేర్కొన్నా రు. ప్రతీ కుటుంబానికి ఒక తోట కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేయాలని, కేంద్ర ప్రభుత్వం సేంద్రి య -ప్రకృతి మిషన్‌ను వందశాతం రాయితీతో ముందుకు నడిపించాలని కోరారు.
ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ తెలంగాణ శాఖ కార్యాలయాన్ని కేంద్రమంత్రి జయంత్ సింగ్ ప్రారం భించారు. కార్యాలయ ప్రారంభోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్ గారి ఆధ్వర్యంలో పలువురు పర్యావరణవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.