07-08-2025 12:15:34 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి ఆగస్టు 6 ( విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమానికి తన యజీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ 91వ జయంతి పురస్కరిం చకుని వారి చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ అని , వారి సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ అన్నారు. రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, ఏవోజగన్మోహన్ ప్రసాద్ ,బీసీ సంక్షేమ అధికారి సాహితి , యస్. సి కార్పొరేషన్ ఈ డి శ్యామ్ సుందర్, బీసీ సంఘం నాయకులు,కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ మండలంలో..
వలిగొండ,ఆగస్టు6 (విజయక్రాంతి): ప్రొఫెసర్ కొతపల్లి జయశంకర్ జయంతిని వలిగొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి ఎంపీడీవో జలంధర్ రెడ్డి పూల మాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ ఎండీ నిరంజన్, ఎంపీఓ కేదారిశ్వర్, కార్యాలయ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
నల్లగొండ టౌన్‌లో..
నల్లగొండ టౌన్, ఆగస్టు6 : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం నల్లగొండలోని ఆయన విగ్రహానికి పలువురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఎస్ కె కరీం పాషా,మాజీ కౌన్సిలర్లు, మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి కొండూరి సత్యనారాయణ, సీనియర్ నాయకులు కంచనపల్లి రవీందర్రావు, సింగం రామ్మోహన్ లొడంగి గోవర్ధన్, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు అయితగోని యాదయ్య, కందుల లక్ష్మయ్య,బడుపుల శంకర్ , వనపర్తి నాగేశ్వరరావు, విద్యార్థి నాయకుడు బొమ్మరబోయి నాగార్జున, దండంపల్లి సత్తయ్య, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి,కంకణాల వెంకటరెడ్డి, కోట్ల జయపాల్ రెడ్డి,గణేష్, తదితరులు పాల్గొన్నారు.
నూతనకల్‌లో..
నూతనకల్, ఆగస్టు 6 :తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సునిత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ శశికళ, సూపర్డెంట్ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు ఉమేష్,మధు, వెంకటరెడ్డి, అనిల్, నాగరాజు,చలమయ్య, వెంకన్న పాల్గొన్నారు.
సూర్యాపేటలో..
సూర్యాపేట, ఆగస్టు 6 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అర్పించుకున్న ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఓ ఆత్మనివేదిత నాయకుడని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. బుధవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాల యంలో నిర్వహించిన జయశంకర్ జయంతి వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిఏచ్.హన్మంత రెడ్డి ,డి .ఇ సత్యారావు సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ,టీపీఓ ఉయ్యాల సోమయ్య ,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ,
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి)లో..
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు06: తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తుంగతుర్తి నియోజకవర్గ కన్వీనర్ దిర్షినపు కృష్ణమూర్తి అన్నారు.బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలో ఆసంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి,తెలంగాణ ప్రజా ఉద్యమ నౌక గద్దర్,ప్రజాస్వామిక వాది జహీర్ అలీఖాన్ ల వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సామాజిక తెలంగాణ మహాసభ జిల్లా అధ్యక్షుడు దడిపల్లి వెంకట్,పూలే అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈదురు వీరపాపయ్య, పెరుమాళ్ళ వెంకటయ్య, ఎడ్ల సైదులు, ఎల్లయ్య, సోమనర్సయ్య, మోహన్, బాకు మల్లయ్య, సుధాకర్ పాల్గొన్నారు.
పలు కార్యాలయాల్లో...
మండల కేంద్రం అర్వపల్లిలోని ఎంపీడీఓ, తహాశీల్దార్ కార్యాలయం, జాజి రెడ్డిగూడెం, కొమ్మాల గ్రామంలోని పంచాయతీ కార్యాలయాల్లో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ గోపి, తహాశీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంఈఓ బాలునాయక్, సీనియర్ అసిస్టెంట్ నరసింహారాజు, పంచాయతీ కార్యదర్శి దేవులపల్లి నవీన్ రెడ్డి, బింగి కృష్ణమూర్తి, ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
నల్గొండ రూరల్‌లో..
నల్గొండ రూరల్, ఆగస్టు 06: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఎం జి యు వీసీ ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడారు. రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, ఆచార్య రేఖ, డా రూప, డా మారం వెంకటరమణారెడ్డి, డా లక్ష్మీ ప్రభ, డా రమావత్ మురళి, జి నరసింహ, డా శ్రవణ్, తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
కోదాడలో..
కోదాడ ఆగస్టు 6 : కోదాడ నియోజక వర్గ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం నాడు యం యస్ విద్యా సంస్థల లో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రో;జయశంకర్ జయంతి, తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన విప్లవ కవి,ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా ఆ ఇరువురికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కన్వీనర్ రాయపూడి చిన్ని మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల కుట్రలకు,కుతంత్రాలకు వ్యతిరేకం గా ప్రజలను సమీకరించి చైతన్య వంతులను చేసిన గొప్ప వ్యక్తులు జయశంకర్, గద్దర్ లు అని అన్నారు ప్రజా చైతన్య వేదిక సభ్యులు పందిరి నాగిరెడ్డి,బడుగుల సైదులు ,స్వామి,రాపర్తి రామనర్సయ్య, హరికిషన్,మరియు యం యస్ విద్యా సంస్థల సీ ఈ వో యస్ యస్ రావు ,అధ్యాపకులు ప్రసాద్, ఐనుద్దీన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.