26-05-2025 01:38:37 PM
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య
తుంగతుర్తి, విజయక్రాంతి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పధకం లో రాజకీయాలతో సంభంధం లేకుండా అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయాలని మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో తుంగతుర్తి సెంటర్ లో నిరసన తెలియ చేస్తూ ధర్నా కార్యక్రమంనిర్వహించిన అనంతరం మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందించారు. రాజీవ్ యువ వికాసం పధకంలో సీబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా అందరికీ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, మండల నాయకులు గుడిపాటి వీరయ్య, గునిగంటి యాదగిరి, బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, కొండగడుపుల వెంకటేష్, కొల్లూరి మహేందర్, పులుసు ఉప్పలయ్య, అకారపు భాస్కర్, లాకావత్ దశరద, గోపగాని వెంకన్న, ప్రసాద్, కొండగడుపుల నాగయ్య, షేక్ జూనీ, సిమ్మాద్రి, బెడదరాములు, పూన్య నాయక్, వీరన్న నాయక్, యాకో నాయక్, సోమేశ్, తదితరులు పాల్గొన్నారు