09-10-2025 12:00:00 AM
హనుమకొండ,అక్టోబర్ 8 (విజయ క్రాంతి):హన్మకొండ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీం కింద చదువుతున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
దీనికి మద్దతు తెలిపిన స్వేరోస్ జిల్లా మాజీ అధ్యక్షులు శనిగరపు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీం లో ప్రభుత్వం ద్వారా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు కల్పించి, చదివించే క్రమంలో ఆయా స్కూల్ లకు గత నాలుగు సంవత్సరాల నుండి చెల్లించాల్సిన ఫీజు బకాయిలను విడుదల చేయకుండా తల్లిదండ్రులను, ప్రభుత్వం మోసగిస్తుందని, ప్రైవేట్ స్కూళ్లలోకి యజమాన్యాలు రానివ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ, చదువుకు దూరం చేసే పరిస్థితిని ప్రభుత్వం తీసుకువచ్చేలా ఉందని విమర్శించారు.
తక్షణమే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల యొక్క బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు, మరియు తల్లిదండ్రుల తో రోడ్డును దిగ్బంధించి ధర్నా, రాస్తారోకో చేయడం జరిగింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయని పక్షంలో విద్యార్థి సంఘాల నేతృత్వంలో మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్‌ఓ గణేష్ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు మహేందర్, అనిల్, తిరుపతి, రాజేష్, వినయ్, నరేష్, సాంబయ్య, సమ్మయ్య, రాజు, రాజేందర్, సమ్మక్క, ప్రణీత, వాణి, నీరజ, శ్వేత, రజిని, ప్రభాకర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.