09-10-2025 12:00:00 AM
స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థి పాల్వంచ దుర్గ
మణుగూరు, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : సింగరేణి ప్రభావిత పెద్దపల్లిలో గిరిజన ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో సింగరేణి సంస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని, స్వతంత్ర జడ్పిటిసి అభ్య ర్థి పాల్వంచ దుర్గ విమర్శించారు. బుధవారం ఆమె గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తుల సమస్యలను అడి గి తెలుసు కున్నారు. అనంతరం దుర్గ మాట్లాడుతూ పెద్దిపల్లి గిరిజన గ్రామం పట్ల సింగరేణి సంస్థ సవితి తల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు.
లక్షలాది రూపాయలతో భూ నిర్వాసిత గ్రామాలకు సదుపాయా లు కల్పిస్తున్నామని చెబుతున్న సింగరేణి అధికారులకు గిరిజన గ్రామం సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గిరిజన ప్రజలంటే సింగరేణి అధికారులకు చిన్నచూ పా అని నిలదీశారు. ప్రశ్నించారు. అమాయక ఆదివాసి గిరిజనుల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు.
ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యం లో విద్యార్థుల కోసం స్కూల్ ఏర్పా టు చేయాలని, నిరుద్యోగ యువత కు సింగరేణి మెడికల్, వీటిసి చేపిం చి ఓబీ కంపెనీలలో ఉపాధి కల్పించాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చే శారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.