19-09-2025 12:00:00 AM
మోతె, సెప్టెంబర్ 18: అనుమతి లేని కోచింగ్ సెంటర్‌లను వెంటనే నిలిపి వేయా లని కోరుతూ బహుజన విద్యార్థి సమైఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని యం ఈ ఓ కార్యాలయం ముందు గురు వారం ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా బహుజన విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు మంద కమలాకర్ మాట్లాడుతూ మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్డులోని విజేత కోచింగ్ సెంటర్ ను అను మతులు లేకుండా నిర్వహించడం సరికాద న్నారు.
విద్యార్థులకు రోజు వారి హాజరు, యఫ్‌ఆర్ ఎస్ ఎట్లా చేస్తున్నారని మండిప డ్డారు. కోచింగ్ ల పేరిట పిల్లల జీవితాలతో ఆటలు ఆడొద్దన్నారు. జిల్లా, మండల విద్యాశాఖఅధి కారుల కను సైగల్లోనే విచ్చల విడిగా ప్రెవేట్ పాఠశాలల్లో కోచింగ్‌లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అనంతరం అక్రమంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లను మూసివేయా లని డిమాండ్‌తో కూడిన వినతిపత్రం యంఇఓ కె. గోపాల్ రావుకు అందించారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.