calender_icon.png 19 August, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లు నీదా..? నాదా..?

19-08-2025 12:00:00 AM

-డబుల్ బెడ్రూం ఇళ్లలో అనర్హుల తిష్ట 

-అర్హులకూ అందని ధ్రువపత్రాలు

-కోటికి పైగా కరెంట్ బిల్లు బాకీ

-పారిశుధ్యం గాలికొదిలిన అధికారులు

గజ్వేల్, ఆగస్టు 18 : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పేదల కోసం నిర్మించిన ఇండ్లు ఇంకా వారి పేరున పట్టాలు ఇవ్వకపోవడంతో పేదప్రజలు ఇంకా అయోమయంలోనే ఉన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో జి ప్లస్ వన్ పద్ధతిలో 1250ల ఇండ్ల నిర్మాణం చేపట్టగా, మన రోడ్ల అభివృద్ధిలో ఇండ్లు కోల్పోయిన వారికి 150 ఇల్లు కేటాయించగా, 1100 ఇండ్లను పేద కుటుం బాలకు కేటాయించడంతో పాటు  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు లాటరీ పద్ధతిలో లబ్ధిదా రులను ఎంపిక చేశారు. 

ఎంపీ ఎన్నికలు పూర్తయినా కూడా  అధికారికంగా లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించకపోవడంతో పేదరి కంలో మగ్గుతున్న పరిస్థితుల్లో గత్యంతరం లేక ఎంపికైన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇండ్లలోకి వెళ్లి నివాసం ఉంటు న్నారు. లబ్ధిదారుల ఎంపికకు ముందే జి ప్లస్ వన్ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మల్లన్న సాగర్ నిర్వాసితులు ఉండగా, ప్యాకేజీలు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యుల కు కూడా ఇంకా ప్యాకేజీలు రావాల్సి ఉంద ని, వచ్చేవరకు ఖాళీ చేయమంటూ అలాగే నివాసం ఉంటున్నారు.

మరికొందరు నిర్వాసితులు అవసరం లేకున్నా తాళాలు వేసు కొని వెళ్లిపోతున్నారు. ఈ ఇండ్లలో  ఎంపిక కాని వారు కూడా అక్రమంగా నివాసం ఉంటున్నారు. ఎంపికైన లబ్ధిదారులు ఎన్నోసార్లు ధర్నాలు చేస్తూ తమ ఆవేదనను వెలిబుచ్చినా, స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కానీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, బాధ్యత వహించాల్సిన అధికారులు కానీ కంటి తుడుపు చర్యలుగా సర్వేలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. కానీ సమ స్యను పరిష్కరించలేకపోయారు. దీంతో ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులతోపాటు, ఇం కా ఇండ్లలోకి వెళ్ళని లబ్ధిదారులు తమకు ఇళ్ల పట్టాలి ఇచ్చి ఇళ్లను అధికారికంగా ఎప్పుడు అప్పగిస్తారని ఎదురుచూస్తున్నారు.

రూ.కోటికి పైగా కరెంట్ బిల్లు బాకీ పడ్డ కలెక్టర్  

మల్లన్న సాగర్ నిర్వాసితులను ఆయా గ్రామాలను ఖాళీ చేయించాలన్న తొందరలో వారికి గజ్వేల్ లో పేదలకు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి  తాత్కాలిక నివాసం కల్పించారు. 2021లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో నిర్వాసితులు నివాసం ఉండగా, ఇండ్లు నిర్మించుకున్న వారు, కేటాయింపు జరిగిన వారు ఇటీవల ఖాళీ చేశారు. ప్యాకేజీలు ప్లా ట్లు రాణి నిర్వాసిలో ఇంకా అవే ఇండ్లలో ఉంటున్నారు. కొద్దినెలలు అప్పటి కలెక్టర్ కరెంట్ బిల్లులు చెల్లించినా ఆ తర్వాత నుండి నేటి వరకు  డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు సం బంధించి  కరెంట్ బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన కరెంట్ బిల్లులు దాదాపు రూ. కోటికి పైగానే పెండింగ్ కావడంతో విద్యుత్ శాఖ అధికారులు ఎవరిని అడగాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

నిర్వాసితుల పరిహారంతో ముడిపడ్డ  డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారుల  సమస్య

గజ్వేల్ పట్టణ పేదలకు కేటాయించిన 1100 ఇండ్లలో ఇప్పటివరకు 55 శాతం లబ్ధిదారులు నివాసం ఉంటుండగా, మిగతా ఇండ్లను మల్లన్న సాగర్ నిర్వాసితులు ఖాళీ చేయకపోవడంతో ఆధ్యాయంలోనే నివాసం ఉంటున్నారు. నిర్వాసితులు ప్లాట్లు ప్యాకేజీలు ఇచ్చేవరకు ఖాళీ చేయమని మొండికే యడంతో ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తే గాని సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

నిర్వాసితులకు పెండింగ్ ప్లాట్లను కేటాయించడానికి ఇటీవల అధికారులు గజ్వేల్ పట్టణంలో మూడెకరాల స్థలాన్ని సేకరించగా ఇంకా సంబంధిత యజమానులకు డబ్బులు చెల్లించకపోవడంతో  పనులు ముందుకు సాగలేదు.  తమ ప్లాట్లు ప్యాకేజీలు ఎప్పుడు వస్తాయా అని ఆటో నిర్వాసితులు, తమకు పట్టాలు ఇచ్చి ఎప్పుడు ఇళ్లను స్వాధీనం చేస్తారని డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఎదురుచూస్తూ ఉన్నారు. 

పారిశుధ్యాన్ని గాలికొదిలేసిన అధికారులు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మున్సిపల్ పరిధిలోనే ఉన్న మున్సిపాలిటీకి ఇంకా అప్పగించకపోవడంతో అక్కడ పారిశుధ్యం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రతిరోజు చెత్త వాహనాల ద్వారా చెత్తను సేకరించిన కూడా ఇండ్ల పరిసరాలలో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం నిండిపోవడమే కాక, మురుగునీటి కాలువలు లీకేజీ అయి ఇండ్ల పరిసరాలలో మురుగునీరు ప్రవహిస్తుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అన్నింటికీ కలిపి నిర్మించిన ఎస్టిపి ( ఉమ్మడి సెప్టిక్ ట్యాంకు) నుండి కూడా మురుగునీరు బయటికి వస్తుండడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధంతో నిండిపోయింది. ప్రభుత్వం కేటాయించిన ఇండ్లలో ఉంటున్నామని సంతోషపడాలో, లేక ఈ మురుగు రూపంలో నివాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందోనని బాధపడాలో తెలియని అయోమయంలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇలా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఎన్నో సమస్యల మధ్య ప్రజలు జీవనం వెలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.