calender_icon.png 28 October, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీహెచ్‌ఓ మరియన్నకు రైతు నేస్తం పురస్కారం

27-10-2025 12:00:00 AM

మహబూబాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి ప్రోత్సాహకంగా స్వర్ణ భారతి ట్రస్ట్ ప్రతి సంవత్సరం అందజేస్తున్న రైతు నేస్తం అవార్డును మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జినుగు మరియన్న అందుకున్నారు.

హైదరాబాదులోని ముచ్చింతల్ లో జరిగిన వేడుకలో భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ , ఉద్యాన, అనుబంధల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రైతు నేస్తం ఎడిటర్ యండపల్లి వెంకటేశ్వరావు చేతుల మీదుగా అందుకున్నారు.

నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ పంట మార్పిడి ద్వారా ఉద్యాన పంటల విస్తరణ, రైతులకు పలు మేలైన యాజమాన్య పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానం, రైతుల విజయ గాధలు మొదలైన విషయాలను తెలియజేస్తూ ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, పూలు, మల్బరీ, మునగ మొదలైన పంటల విస్తరణకు రైతులకు అవగాహన చేస్తూ, జిల్లాలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటల విస్తరణ చేయడానికి మరియన్న విశిష్ట సేవలు అందించారు. ఉద్యాన పంటలు కూడా 10 వేల ఎకరాల విస్తరణ చేసినందుకు మరియన్న చేసిన సేవలను గుర్తిస్తూ విస్తరణ విభాగంలో రైతు నేస్తం  2025 పురస్కారాన్నీ అందుకున్నారు.