calender_icon.png 13 July, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరేసుకొని వ్యక్తి మృతి

13-12-2024 01:19:06 AM

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 12: స్నేహతుడు పుట్టినరోజు వేడుకకు వెళ్లొస్తానని చెప్పిన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిభట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం ఎంపీ పటేల్‌గూడకు చెందిన తేజేశ్వర్ రెడ్డి (24) బుధవారం రాత్రి తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లివస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి గురువారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. తల్లి వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా తేజేశ్వర్ ఉరేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.