calender_icon.png 18 November, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధృవకు ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా

18-11-2025 12:00:00 AM

చెస్‌లో హైదరాబాదీ ప్లేయర్ సంచలనం

హైదరాబాద్, నవంబర్ 17 :చదరంగంలో గత కొంతకాలంగా సంచలనాలు సృష్టిస్తున్న హైదరాబాదీ యంగ్ ప్లేయర్ ధృవ తోట మరో ఘనత సాధించాడు. 16 ఏళ్ల ధృవ ఇంటర్నేషనల్ మాస్టర్(ఐఎం) హోదా అందుకున్నాడు. తెలంగాణ నుంచి ఈ ఘనత అందుకున్న 13వ ప్లేయర్‌గా నిలిచాడు. 2021 నుంచీ అండర్ 14 స్థాయిలోనే సంచలన విజయాలు నమోదు చేసిన ఈ చిచ్చర పిడుగు తన అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూనే ఉన్నాడు. 2023 నవంబర్‌లో హంగేరీలో తొలి నార్మ్ సాధించి ఐఎం హో దాకు పునాది వేసుకున్నాడు.

అక్కడ నుంచి తన సంచలనాల పరంపర కొనసిగ్సతూ స్పె యిన్, ఫ్రాన్స్‌లో జరిగిన పలు టోర్నీల్లో సత్తా చాటాడు. ఈ ప్రదర్శనలతో వరుసగా రెండు నార్మ్‌లను సాధించాడు. ఇప్పుడు సెర్బియాలో జరిగి రుడార్ ఐఎం నార్మ్ రౌండ్ రాబిన్ టోర్నీలో విజేతగా నిలిచి నాలుగో నార్మ్‌ను కూడా దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ధృవకు ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా లభించింది. ప్రస్తుతం ఈ హైదరాబాదీ సంచలనం ఫిడే రేటింగ్‌లో 2411 పాయింట్లతో నిలిచాడు. 

2022లో తెలంగాణ స్టేట్ అండర్ బాలుర చాంపియన్‌షిప్, 2019 వర కూ పలుసార్లు తెలంగాణ స్టేట్ చెస్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచాడు. 2021 వెస్ట్రన్ ఏషియన్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో 5వ స్థానం సాధించాడు. ఇటలీలో జరిగిన ఫిడే వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో 18వ ర్యాంకులో నిలిచాడు.

గత ఏడాది తెలంగాణ స్టేట్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ధృవ పలు జాతీయ స్థాయి టోర్నీ ల్లోనూ మెరిసాడు. ప్రస్తుతం ఐఎం హోదా రావడంతో ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ హోదా ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే దీనికి అత్యుత్తమ స్థాయి కోచింగ్ తీసుకోవాల్సి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం, కార్పొరేట్ సంస్థల స్పాన్సర్‌షిప్‌ను కోరుతున్నాడు.