18-11-2025 12:00:00 AM
20 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన
బెంగళూరు, నవంబర్ 17 : దేశంలో అతివేగంగా ఆదరణ పొందుతున్న పికిల్‌బా ల్‌లో తెలంగాణ క్రీడాకారులు అదరగొడుతున్నారు. బెంగళూరు వేదికగా ముగిసిన పికిల్‌బాల్ నేషనల్స్‌లో తెలంగాణ జట్టు పతకాల పంట పండించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ అన్ని కేటగిరీల్లో కలిపి ఏకంగా 20 పతకాలు గెలుచుకుంది. కెప్టెన్ శ్రీకర్ మోతు కూరి పురుషుల టీమ్ 40+ విభాగంలో స్వర్ణం, 30+,40+ డబుల్స్+ విభాగాల్లో రెండు రజతాలు సాధించారు.
మహిళల విఙాగంలో ప్రీతి రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి ఒక రజతం, మూడు కాం స్యాలు గెలుచుకున్నారు. జూనియర్ స్థాయి లో సత్తా చాటుతున్న నాగ మోక్ష అండ ర్‌ఙూ సింగిల్స మిక్సిడ్ డబుల్స్‌లో రెండు స్వర్ణాలు సాధించింది. ఓవరాల్‌గా నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, 13 కాంస్యాలు దక్కాయి.
ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలిచిన ప్లేయర్స్‌కు తెలంగాణ పికిల్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ, ఒలింపి యన్ విష్ణువర్థన్ అభినందనలు తెలిపారు. జాతీయ స్ఖాయిలో ఇలాంటి అద్భుత ప్రదర్శన కనబరిచి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు.