17-10-2025 12:58:53 AM
పోలీసు వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యం
ఎస్పీసీఏ ప్రత్యేక వెబ్‌సైట్, లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 16 (విజయక్రాంతి): పోలీసుల తీరుపై ప్రజలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రజలకు మరింత సులభమైన, పారదర్శకమైన వేదికను రాష్ర్ట ప్రభుత్వం అందుబాటు లోకి తెచ్చింది. పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా, రాష్ర్ట పోలీ స్ కంప్లయింట్స్ అథారిటీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్, లోగోను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు గురువారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ర్ట సచివాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అధికారులు వెబ్‌సైట్ పనితీరును, దాని ద్వారా ప్రజలు సులభంగా ఫిర్యాదులు ఎలా నమోదు చేయవచ్చో ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కొత్త ఆన్‌లైన్ వ్యవస్థ పోలీస్ శాఖలో జవాబుదారీతనాన్ని మరింత పెం చేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్, సీజీజీ డీజీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కు మార్, ఎస్పీసీఏ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ శివశంకర్ రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.