14-09-2025 12:00:00 AM
తేజ సజ్జా హీరోగా నటించిన తాజాచిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శ కత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మనోజ్ మంచు ప్రతినాయక పాత్ర పోషించగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్ 12న రిలీజైన ఈ చిత్రానికి ప్రస్తు తం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ శనివారం థాంక్స్‌మీట్ నిర్వహించిం ది. బ్రహ్మాండ్ బ్లాక్‌బస్టర్ పేరుతో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో హీరో తేజ మాట్లా డుతూ.. ‘సినిమా చూసిన ప్రేక్షకులు ప్రత్యేకంగా రీల్స్ చేస్తూ ఈ సినిమా గురించి ప్రమోట్ చేస్తుంటే సంతోషం అనిపించింది” అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ.. “దాదాపు12 ఏళ్ల తర్వాత సక్సెస్‌తో నా ఫోన్ మోగుతూనే ఉంది. నిన్నటి నుంచి ఇదంతా కలలా ఉంది. ఈ కథలో నన్ను భాగం చేసినందుకు డైరెక్టర్ కార్తిక్‌కు జన్మంతా రుణపడి ఉంటా ను. ఇంతకుముందు ఎక్కడికి వెళ్లినా సినిమా ఎపుడు అని అందరూ అడిగేవారు. త్వరలోనే వస్తానని వాళ్లతో బయటకు ధైర్యంగా మాట్లాడినా.. లోపల తెలియని భయం ఉండేది.
అలాంటి టైమ్‌లో కార్తిక్ నన్ను మాత్రమే నిలబెట్టలేదు.. నాతోపాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు. నేను పెరిగినట్లు నా పిల్లల్ని పెంచగలనా అని ఎప్పుడూ భయపడేవాడిని. ఆ భయాన్ని కార్తిక్ చంపేశారు. ప్రతి ఇంట్లో నుంచి మనో జ్ గెలవాలని కోరుకున్న వారందరికీ పేరుపేరునా పాదాభివందనం. ఇకపై వరుస సిని మాలు చేస్తూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా” అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “మిరాయ్’ లాంటి అద్భుతమైన విజయం మాకు మరెన్నో సినిమాలు చేసే గొప్ప శక్తినిచ్చింది. నేను చాలా కష్టపడి ఇక్కడివరకు వచ్చాను. డబ్బు విలువ తెలుసు. ఆ డబ్బు ను ఎలా ఖర్చు చేయాలో కూడా తెలుసు. మా అమ్మాయి కృతి ప్రసాద్ ఈ సినిమాతో నిర్మాతగా మారారు. తను మా లక్కీ చార్జ్ అని భావిస్తున్నాం” అని చెప్పారు. ‘తేజకి 2021లో ఈ సినిమా ఐడియా చెప్పాను.
అప్పటినుంచి ట్రావెల్ అవుతున్నాం. నాలుగేళ్లు జర్నీ అంత ఈజీ కాదు’ అని డైరెక్టర్ కార్తీక్ తెలిపారు. ‘విభా అద్భుతమైన క్యారెక్టర్. చాలా స్పెషల్. నా మనసులో ఎప్పు డూ నిలిచిపోతుంది’ అని హీరోయిన్ రితికా నాయక్ తెలిపింది. మ్యూజిక్‌కి మంచి రెస్పా న్స్ రావడం చాలా ఆనందాన్నిచ్చింద’ని మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర తెలిపారు.