calender_icon.png 16 August, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి సాగులో నేరుగా వరి విత్తితే అధిక దిగుబడులు

24-07-2025 06:34:20 PM

ఏఓ అనిల్ కుమార్..

పెన్ పహాడ్: రైతులు వరి సాగులో కూలీలతో నాటు విధానంలో కాకుండా నేరుగా డ్రమ్ సీడర్, వరి విత్తనాలు వెదజల్లే పద్దతి పాటిస్తే అధిక దిగుబడులు సాధిస్తారని ఏఓ అనిల్ కుమార్(AO Anil Kumar) రైతులకు సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని అనాజిపురం గ్రామంలో డ్రమ్స్ లీడర్, వెదజల్లే పద్దతిలో వరి సాగుచేసిన రైతుల పంట పొలాలను సందర్శించి పలువురు రైతులకు అవగాహన కల్పించారు. అలాగే ఈ పద్దతిలో సాగు చేసిన రైతులకు కలుపు నివారణకు చర్యలు ప్రధానమన్నారు. ఈ సందర్బంగా పలు సలహాలు సూచనలు అందించి రైతుల్లో నెలకొన్న సమస్యలు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఏఈఓ మురళి, రైతులు పాల్గోన్నారు.