24-07-2025 06:36:46 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal)లోని అరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని అప్పారెడ్డిపల్లి గ్రామంలో ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి 50,000/- రూపాయలు ఒకసారి, గురువారం మరో 25,116/- రూపాయలు డిసిసి ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, మత్స్యగిరి గుట్ట డైరెక్టర్ కోడితల కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.