calender_icon.png 31 December, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారుల సమన్వయమే కీలకం

31-12-2025 01:00:23 AM

మహా శివరాత్రి జాతరపై అధికారులకు దిశానిర్దేశం

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే : ఆది శ్రీనివాస్ జాతర చైర్పర్సన్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

వేములవాడ,డిసెంబర్ 30,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎ లాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖ లు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జాతర చైర్పర్సన్, ఇం చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర ఏర్పాట్లపై వేములవాడ భీమేశ్వర సదన్లో మంగళవారం నిర్వహించిన సమన్వయ స మావేశంలో వారు మాట్లాడారు.

ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే, అదన పు కలెక్టర్ గడ్డం నగేష్ తదితరులు హాజరయ్యారు.భక్తులు భీమేశ్వర స్వామివారి దర్శ నాన్ని సులభంగా,వేగంగా చేసుకునేలా క్యూ లు, పార్కింగ్, హెల్ప్డెస్క్లు, సైన్బోర్డులు పక్కా గా ఏర్పాటు చేయాలని సూచించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం వరకు రహ దారుల మరమ్మత్తులు పూర్తి చేయాలని, రద్దీకి తగినట్లుగా ఆర్టీసీ బస్సులు సిద్ధం చే యాలని ఆదేశించారు. బస్టాండ్లో తాగునీరు, మరుగుదొడ్లు, హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు.పారిశుధ్య పనులను మున్సి పాలిటీ, జిల్లా పంచాయతీ సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికతో చేపట్టాలని, ఆల య ప్రాంగణం అంతటా నాణ్యమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆర్డబ్ల్యూ ఎస్, మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. భక్తులకు ఉప్మా, పులిహోర, పెరుగు అన్నం వంటి అల్పాహారం పరిశుభ్ర వాతావరణంలో అందించాలని తెలిపారు.

ఆలయ ఆవరణలో 24 గంటల వైద్య బృందం ఏర్పాటు చేయాలని, ఫైర్ సేఫ్టీ తనిఖీలు పూ ర్తిచేయాలని, ప్లాస్టిక్ వినియోగం నిషేధించాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్చైర్లు, వాలంటీర్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించాలని తెలిపారు. దర్శనం, వాహ న పాస్ల పంపిణీ సజావుగా జరుగుతుందని వారు స్పష్టం చేశారు. మరో సమన్వయ సమావేశం నిర్వహించి అన్ని శాఖల యాక్షన్ ప్లాన్లను సమీక్షిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బీ గితే మాట్లాడుతూ, జాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, వీఐ పీల దర్శనానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని తెలిపారు. పట్టణంలో సీసీ కెమెరాలు, సైన్బోర్డులు ఏర్పాటు చేసి భద్రత పటిష్టం చేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీఓ రాధా బాయి, ఆలయ ఈఓ రమాదేవి, ట్రైనీ డిప్యూ టీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.