calender_icon.png 16 May, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో క్రమశిక్షణ

16-05-2025 12:45:09 AM

కరీంనగర్ క్రైం, మే 15 (విజయక్రాంతి): క్రీడలు చిన్నారుల్లో క్రమశిక్షణ, శారీరక దారుడ్యం, మానసిక ఉల్లాసం పెంపొందిస్తాయని సీపీ గౌస్ ఆలం, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో జిల్లా క్రీడా శాఖ సౌజన్యంతో  ఉచిత వేసవి క్రీడా శిక్షణ తరగతులు గురువారం రోజు ప్రారంభమయ్యాయి.

నగరపాలక సంస్థ ఆద్వర్యంలో కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ అద్యక్షతన నిర్వహించే ఉచిత వేసవి శిక్షణ తరగతులకు మఖ్య అతితులుగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం, నగరపాలక సంస్థ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనం చేసి...ఉచిత క్రీడా శిక్షణ తరగతులను ప్రారంభం చేశారు.

17 క్రీడా అంశాల్లో విద్యార్థిని విద్యార్థులకు జూన్ 10 వ తేది వరకు కోచ్ ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సంబంధిత క్రీడా అంశాల్లో శిక్షణ పొందెందుకు మొత్తం 1746 మంది విద్యార్థిని విద్యార్థుల నుండి దరఖాస్తులు రావడం జరిగింది. ప్రతి రోజు రెండున్నర గంటల పాటు సంబంధిత క్రీడల్లో కోచ్ లు మెలకువలు నేర్పి... అనంతరం విద్యార్థులకు అరటిపండు, గుడ్డు, పాలు పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. ఉచిత వేసవి క్రీడా శిక్షణ తరగతుల ప్రారంభోత్సవం లో సంస్కృతిక కార్యక్రమాలు, యోగా, కరాటే విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. 

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం వేసవి కాలంలో కరీంనగర్ నగరపాలక సంస్థ చిన్నారుల కోసం ఉచిత క్రీడా శిక్షణ తరగతులు నిర్వహించడం చాలా గర్వకారణం అన్నారు. ఈ సంవత్సరం కూడ ప్రత్యేక చొరవ తీస్కోని ఉచిత వేసవి క్రీడా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిన కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.   క్రీడలు క్రమశిక్షణ, శారీరక దారుడ్యం, మానసిక ఉల్లాసం ను పెంపొందించడమే కాకుండా మన భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తాయని పిలుపు నిచ్చారు.  నగర పాలక సంస్థ  కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్  తదితరులు పాల్గొన్నారు.