calender_icon.png 16 May, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

16-05-2025 12:46:36 AM

 మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

కరీంనగర్, మే 15 (విజయక్రాంతి): మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకత్వం అనేది వాటి అంతర్గత వ్యవహారమని అన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ ను చేశారు, మమ్మల్ని అడిగి చేశారా అని ప్రశ్నించారు. ఆయనను ఎందుకు పెట్టారు,  దళితుడికి ఎందుకు ఇవ్వలేదని మేము అడిగామా అని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ అని అన్నారు. ఎవరైతే తెలంగాణ ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందో వారినే బీఆర్‌ఎస్ ఎంచ కుంటుందన్నారు.

దళిత ముఖ్యమంత్రి అన్నది 2014కు ముందు అని, మేము అధికారంలోకి రాలేదు విజయ రామారావును బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ గా నియమించామని అన్నారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విజన్ను సిద్ధం చేసుకున్న కేసీఆర్ సీఎం అయితేనే మంచిది అనుకుని పార్టీ, తెలంగాణ ముక్తకంఠంతో నిర్ణయం తీసుకుందని, అందుకే దళితుడు సీఎం కాలేదని అన్నారు. 

ఖర్గే ఏఐసీసీ డమ్మీ అధ్యక్షుడని, నడిపేదంతా రాహుల్ అని జనానికి తెలియదా, సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జంప తప్ప కాంగ్రెస్లో ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పగ్గాలు దళితునికి ఇవ్వాలంటున్న రేవంత్ రెడ్డి ఖర్గేను పీఎం చేస్తామని ఎందుకు అనడం లేదు, రాహుల్ని పీఎం చేస్తామని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.

రేవంత్ కు దళితుల పట్ల ప్రేమ ఉంటే ఓ దళితున్ని సీఎం చేయాలని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారంలో రేవంత్ జోక్యం తగ్గించి పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల దళిత డిక్లరేషన్ అమలు గ రించి రేవంత్ ఆలోచించాలనిన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు రఘువీర్ సింగ్, గుంజపడుగు హరిప్రసాద్, మైకెల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.