calender_icon.png 16 May, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదుగురు గొలుసు దొంగల అరెస్ట్

16-05-2025 12:44:58 AM

అర్మూర్, మే 15 (విజయ క్రాంతి) : నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుసగా మహిళల మెడలోనుంచి గొలుసు దొంగతనాలకు పాల్పడిన నిందితులు పట్టుబడినట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు.  గురువారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ కు చెందిన శ్రీనివాస్,  గోరే కేశవ్ సురేశ్  అలియాస్ శ్రీను, నిర్మల్ జిల్లా తల్వాడ గ్రామానికి చెందిన పుర్బాజీ బాలాజీ ఇర్లేవాడ్ అలియాస్ శ్రీనివాస్, రాజు అప్పారావ్ పిటేవాడ్, అర్మూర్ కు చెందిన విజయ్, దండేవాడ్ బాబులు కలిసి మహిళల మెడలోనుంచి గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు దొంగతనాల చేతన కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలిస్తుండగా గురువారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పత్తిలో కనిపించిన ఐదుగురు నిందితులు పట్టుబడినట్లు వివరించారు.

వీరిలో ఇద్దరు పరార్ లో ఉన్నట్లు ఆయన వివరించారు. అర్మూర్ ఏసీపీ జే.వెంకటేశ్వర్ రెడ్డి ఆద్వర్యంలో అర్మూర్ సిఐ పి.సత్యనారాయణ, అర్మూర్ రూరల్ సిఐ కే.శ్రీధర్ రెడ్డి, ముప్కాల్  ఎస్.ఐ. వి.రజిని కాంత్, సిబ్బందిచే ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరస్థులను గురువారం ఉదయం  పెర్కిట్ బైపాస్ దగ్గర గల 44వ జాతీయ రహదారిపై పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

వారి వద్ద నుండి సుమారు 122 గ్రాముల  బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వారి వద్ద నుంచి ఒక ట్రాక్టర్ ట్రాలీ, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు. ఏ-1 శ్రీనివాస్ సాహెబ్ రావ్ పిటేవాడ్ అలియాస్ మాధవ్ ఏ-2 గోరే కేశవ్ సురేశ్ అలియాస్ శ్రీను ఏ-3 పుర్బాజీ బాలాజీ ఇర్లేవాడ్ ఏ-4 ఎలిశెట్టి శ్రీనివాస్ ఏ-5 రాజు అప్పారావ్ పిటేవాడ్, ఏ-6 విజయ్ మరియు ఏ-7 దండేవాడ్ బాబు అందరూ మహారాష్ట్ర కు చెందినవారు.

వీరు గత కొన్ని రోజుల నుండి బ్రతుకు దెరువు రీత్యా నిర్మల్ జిల్లాలోని మంజులపూర్ గ్రామానికి వలస వచ్చి కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నారు. కూలిపని చేయగా  వచ్చే డబ్బులు వారి ఖర్చులకు కుటుంబ పోషణకు సరిపోక దొంగతనాలకు అలవాటు పడి ఏ-1 యొక్క హీరో స్ప్లెండర్ బైకుపై మరియు ఏ-3 యొక్క బుల్లెట్ బైకుపై అలాగే దొంగిలించిన హోండా షైన్ బైకుపై తిరుగుతూ ఆటోలో వెనుకలా కూర్చున్న మహిళ లను టార్గెట్ చేసుకుని ఆటో వెనుకాలే వెళ్ళి వారి మెడలో గల బంగారు చైన్ లను తెంపుకుని పోయారని అన్నారు.

వీరు ఆర్మూర్ ఏరియాలో రెండు, ముప్కాల్ లో ఒకటి, సారంగాపూర్ మండలం లో రెండు, భైంసా మండలం లో ఒకటి, మెట్ పల్లి లో ఒకటి, జక్రాన్ పల్లి మండలం లో ఒక దొంగతనం ప్రయత్నం చేసి, ట్రాక్టర్ దొంగతనం చేసినట్లు వివరించారు. వరుస దొంగతనాల వలన పోలీసుల నిఘా ఎక్కువై వీళ్ళు మహారాష్ట్ర లోని ఉమ్రి పారిపోయి మొబైల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసుకుని అక్కడే ఉండి గురువారం వీరు రెండు బైకులపై మళ్ళీ దొంగతనం చేయాడానికి ఆర్మూర్ వైపునకు వస్తుండగా ఆర్మూర్ మండలం లోని పెర్కిట్ బైపాస్ దగ్గర వాహనాల తనికి చేస్తున్న ఆర్మూర్ పోలీసులు వీరిని పట్టుకుని విచారించగా వీరు చేసిన దొంగతనాలను ఒప్పుకోవడం జరిగిందని అన్నారు.

ఏ-6 విజయ్ మరియు ఏ-7 దండేవాడ్ బాబు లు పరారీలో ఉన్నారు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని సిపి సాయి చైతన్య అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జే.వెంకటేశ్వర్ రెడ్డి, అర్మూర్ సిఐ పి.సత్య నారాయణ, రూరల్ సిఐ కే.శ్రీధర్ రెడ్డి, ముప్కాల్ ఎస్.ఐ. వి.రజిని కాంత్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.