calender_icon.png 19 July, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రేషన్ కార్డులు

19-07-2025 12:29:59 AM

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

 కోదాడ జులై 18 : రేషన్ కార్డుల కోసం ప్రజలు దిగులు చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని  ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం రోడ్డులో గల డేగ బాబు ఫంక్షన్ హాల్ నందు నూతన రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొని మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన ప్రజల కోరిక నెరవేర్చుతుండడం సంతోషంగా ఉందన్నారు.

4201 కొత్త రేషన్ కార్డులు లబ్దిదారులకు అందజేశారు. రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అనంతరం కాశినాథమ్ పంక్షన్ హాల్ నందు జరిగిన కోదాడ నియోజకవర్గం లోని 6 మండలాల మహిళా సమాఖ్య సభ్యులతో ఇందిరా మహిళ శక్తి సంబరాలు -2025 లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి కోదాడ శాసన సభ్యురాలు యన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎవరి మీద ఆధార పడకుండా స్వయంగా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఎస్ హెచ్ జి ల ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తుందని తెలిపారు. ఎస్ హెచ్ జి ల ద్వారా టైలరింగ్, డైరీ పారం, కోళ్ల ఫారం,ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్స్, బస్సు లు, బ్యూటీ పార్లర్,మిల్క్ పార్లర్, ఫిష్ మొబైల్స్ వాహనాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటివి ఏర్పాటు చేసుకొనేందుకు రుణం అందించి స్వయంగా ఆర్థికంగా మహిళలు బలోపేతం కావాలని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే పద్మావతి నిధులతో ఏర్పాటుచేసిన గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం నియోజకవర్గంలోని 260 మందికి మంజురైన రూ.85.36 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పద్మావతి లబ్దిదారులకు అందజేశారు. అనంతరం పట్టణంలో కోదండరామాలయంలో జరిగిన పూజల్లో ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. దేవతలకు సారె అందజేసే పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

కోదాడ డివిజన్ రెవెన్యూ  అధికారి సూర్యనారాయణ, తాసిల్దార్ వాజిద్ అలీ,  మోతె మండల తాసిల్దార్, సీనియర్ అసిస్టెంట్ శైలజ, డిటి సూరయ్య, ఆర్‌ఐ రాజేష్ ,జగదీష్, డి ఆర్ డి ఎ పిడి వివి అప్పారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ,ఇందిరా మహిళా శక్తి డైరెక్టర్ సునీత,ఎ పి డి సురేష్, మాజీ శాసన సభ్యులు వేనేపల్లి చందర్ రావు, చింతకుంట్ల లక్ష్మి నారాయణరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మార్కెట్ కమిటీ చైర్మన్. ఏపూరి తిరుపతమ్మ,వైస్ చైర్మన్ బషీర్, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రమీల రమేష్, వైస్ చెర్మన్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.