calender_icon.png 22 January, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేకేఆర్ ఫీల్డింగ్ కోచ్‌గా దిశాంత్ యాగ్నిక్

22-01-2026 01:24:54 AM

కోల్‌కత్తా, జనవరి 21 : ఐపీఎల్ 2026 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ సన్నాహాలు మొదలుపెట్టాయి. ప్రస్తుతం తమ సహాయక సిబ్బందిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా దిశాంత్ యాగ్నిక్‌ను నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన యాగ్నిక్ దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

2011 నుంచి 2014 మధ్యకాలంలో 25 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆటకు వీడ్కోలు పలికినప్పటి నుంచీ ఫీల్డింగ్ కోచ్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తమ ఫ్రాంచైజీకి కోల్‌కత్తా అతన్ని తీసుకుంది. కాగా ప్రధాన కోచ్‌గా అభిషేక్ నాయర్‌కు బాధ్యతలు అప్పగించింది. గత సీజన్‌లో నైట్‌రైడర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 14 మ్యాచ్‌లలో కేవలం ఐదింటిలోనే గెలిచి ఏడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. గ్రూప్ స్టేజ్ కూడా దాటకపోవడంతో వేలంలో పలు మార్పులు చేసింది.