calender_icon.png 29 January, 2026 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నింగ్ కౌన్సిల్‌ను రద్దు చేయండి

28-01-2026 12:00:00 AM

బీసీసీఐకి మరోసారి టీసీఏ ఫిర్యాదు

హైదరాబాద్, జనవరి 27 : హైదరాబాద్ క్రికెట్ అ సోసియేషన్‌పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) బీసీసీఐకి మరోసారి ఫిర్యాదు చేసింది. బీసీసీఐ రాజ్యాం గాన్ని ఉల్లంఘించడంతో పాటు కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని బోర్డు దృష్టికి తీసుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ టీ20 లీగ్ నిర్వహించేందుకు ప్రకటన చేసారని, దీని కోసం గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసారని పేర్కొంది.

ఏ నిర్ణయం తీసుకునేందుకైనా ఏజీఎం తప్పనిసరిగా ఉంటే హెచ్‌సీఏ మాత్రం దీనికి భిన్నంగా సొంత నిర్ణయాలు తీసుకుందని తెలిపింది. టీ20 లీగ్ నిర్వహించే అధికారం హెచ్‌సీఏకు లేదని స్పష్టం చేసింది. అలాగే గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం కూడా నిబంధనలకు విరుధ్దంగా జరిగిందని టీసీఏ తమ ఫిర్యాదులో రాసుకొచ్చింది. ఏజీఎం ఆమోదం లేకుండా గవర్నింగ్ కౌన్సిల్ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది.

ప్రస్తుతం సభ్యులుగా ఉన్న కొందరికి అర్హత లేకున్నా పదవులు ఇచ్చారని బీసీసీఐ దృష్టికి తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా హెచ్‌సీఏపై నమోదైన అవినీతి కేసు విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ అసోసియేషన్ నుంచి నిషేధించాలనిడిమాండ్ చేసింది. ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలను నిలిపివేసి గవర్నింగ్ కౌన్సిల్‌ను రద్దు చేయాలని లేఖలో కోరింది.

హెచ్‌సీఏను పర్యవేక్షించేందుకు తాత్కాలికంగా ఒక అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలని కోరిం ది. వీలైనంత త్వరగా హెచ్‌సీఏపై చర్యలు తీసుకుని తెలంగాణలో క్రికెట్‌ను కాపాడాలని బీసీసీ ఐని కోరింది. ఈ మొత్తం వివాదాలు తేలే వరకూ హెచ్‌సీఏకు బీసీసీఐ ఎలాంటి నిధులు చెల్లించవద్దని కోరింది.