calender_icon.png 29 January, 2026 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచలనాలకు స్కాట్లాండ్ సిద్ధం

28-01-2026 12:00:00 AM

టీ20 ప్రపంచకప్‌కు జట్టు ప్రకటన

దుబాయ్, జనవరి 27 : టీ20 వరల్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో అనూహ్యంగా అవకాశం దక్కించుకున్న స్కాట్లాండ్ మెగా టోర్నీకి సిద్ధమైంది. ఐసీసీ నుంచి వార్త రావడమే ఆలస్యం జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన స్కాట్లాండ్ జట్టుకు రిచీ బెరింగ్టన్ నాయకత్వం వహించనున్నట్లు తెలిపింది. 2024లో టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న వారిలో 11 మంది ఆటగాళ్లు తాజా టోర్నీకి కూడా ఎంపికయ్యారు.

ఇద్దరు ట్రావెలింగ్ రిజర్వ్లు, మరో ముగ్గురిని నాన్ ట్రావెలింగ్ రిజర్వ్లుగా ఎంపిక చేశారు.  యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో పాల్గొన్న స్కాట్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్ కంటే వెనుకబడడంతో నేరుగా అర్హత సాధించలేకపోయింది. అయినా, అత్యధిక ర్యాంక్ ఉన్న జట్టుగా ఉం డటంతో ఐసీసీ స్కాట్లాండ్‌ను టోర్నీలోకి ఎంపిక చేసింది.  ఇప్పటివరకు ఐదు సార్లు టీ20 వరల్ కప్‌లో పాల్గొన్న స్కాట్లాండ్ గత రెండు ఎడిష న్లలోనూ సూపర్-8కు చేరలేకపోయింది. 

టీ20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ జట్టు : రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఆలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్క్రీత్, బ్రాండన్ మెక్ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్