ఏడుగుళ్ల ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ
16-06-2026 02:28 AM
మేడ్చల్ అర్బన్ జూన్ 15(విజయక్రాం తి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మే డ్చల్ సర్కిల్ పట్టణంలోని ఏడు గుళ్ల ఆల యం వద్ద అధిక అమవాస్య సందర్భంగా శ్రీపాద వల్లభ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గుప్తా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల అమవాస్య రోజున నిజమైన ఆకలితో ఉన్నవారికి ఒకపూట కడుపునిండా భోజనం పెడుతున్న శ్రీపాద వల్లభ ట్రస్ట్ సభ్యులు ఆకలితో ఎవరు కూడా ఉపవాసం ఉండకూడదని అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీపాద వల్లభ ట్రస్ట్ సభ్యులు నరసింహులు పటేల్, మల్లికార్జున స్వామి, శేఖర్ పటేల్, సంతోష్ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.






