16 June, 2026 | 4:28 AM

విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ

16-06-2026 02:27 AM

మేడ్చల్ అర్బన్ జూన్15 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మేడ్చల్ మున్సిపల్ మాజి వైఎస్ చైర్మన్ చీర్ల రమేష్ పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్ లను పంపిణీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పా ఠశాలలను ప్రారంభమైన నేపథ్యంలో మేడ్చ ల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ లను పంపిణీ చేయ డం జరిగిందని చెప్పారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యురాలు మంజుల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు రెడ్డి లు పాల్గొన్నారు.అనంతరం చీర్ల రమేష్ మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశా రు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని మాజి వైఎస్ చైర్మన్ చీర్ల రమేష్ కొనియాడారు.