02-07-2025 04:50:32 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) నెన్నల మండలం జోగపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. నెన్నల పోలీసులు తెలిపిన ప్రకారం.. సిరివంచ పెంటుపాకు గ్రామానికి చెందిన బోయ నవీన్(23) బైక్ పై అత్తగారింటికి వస్తూ వేగంగా వచ్చి సిమెంటు స్తంభానికి ఢీకొని మృతి చెందాడు. 20 రోజుల క్రితం తన భార్య మాధురి ఆరోగ్యం బాగాలేక పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకువెళ్లడానికి నవీన్ బైక్ పై అత్తారింటికి వస్తున్నాడు. ఈ క్రమంలో జోగాపూర్ బ్రిడ్జికి సమీపంలోని కరెంటు స్తంభానికి బైక్ ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో తలకు బలమైన గాయమై నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు భార్య బోయ మాధురి ఫిర్యాదు మేరకు నెన్నల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.