06-11-2025 06:46:28 PM
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ శివారులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ పరిసరాలలోని యాచకులకు గురువారం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చలి తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న యాచకులకు నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేయడం హర్షoచదగ్గ విషయమని పేర్కొన్నారు.
ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవ కార్యక్రమాలు చేపడుతున్న మేడి హరికృష్ణను అభినందించారు. ప్రతి ఒక్కరిలోని సేవ గుణం అవసరమని చలికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరాశ్రయులు యాచకులకు ప్రతి ఒక్కరు దుప్పట్లు వస్త్రాలు పంపిణీ చేసి తమ ఉదారత స్వభావాన్ని చాటాలని హరికృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో సాయి సేవకులు భోజరాజు శకుంతల, హైమ, ఎల్లయ్య, రాంబాబు, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.