27-08-2025 03:00:40 AM
పంపిణీ చేసిన కార్పొరేటర్ రజితపరమేశ్వర్‌రెడ్డి
ఉప్పల్ ఆగస్టు 26 (విజయక్రాంతి) : వినాయక చవితి సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మట్టి గణపతులను ఉప్పల్ లో కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ లోని విటీ కమాన్ వద్ద గురువారం గణపతులను రజితపరమేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరు పర్యావరణహితమైన మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్ గారు, ఈగ ఆంజనేయులు ముదిరాజ్, తుమ్మల దేవి రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, మహంకాళి రాజు ముదిరాజ్,మాశెట్టి రాగవేందర్ గుప్తా కాయ హనుమంత్ ,బోడిగా మల్లేష్ గౌడ్,తోకట రాజు తదితరులు పాల్గొన్నారు.