calender_icon.png 26 August, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెస్‌క్లబ్‌లో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

26-08-2025 03:05:50 AM

ఖైరతాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ గణేష్ మట్టి విగ్రహాలను పూజించాలని ప్రెస్ క్లబ్ కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమాజిగూడ లోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సోమవారం నాడు హెఎండిఏ సహకారంతో గణేష్ మట్టి విగ్రహాల ను ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి ఏ. రాజేష్ పంపిణీ చేయడం జరిగింది.ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా హెఎండిఏ అందించే గణేష్ మట్టి విగ్రహాలను ఈసారి కూడా ప్రెస్ క్లబ్ సభ్యులకు అందజేశారు.

హైదరాబాద్ జంట నగరాల్లో హెఎండిఏ మొత్తం లక్ష వరకు గణేష్ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుంది.ఇందులో భాగంగా జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ లో రెండు వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని జాయింట్ సెక్రటరీ చిలుకూరి హరిప్రసాద్ కోశాధికారి రాజేష్ అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పక్కనపెట్టి మట్టితో చేసిన గణేష్ ప్రతిమలను పూజించాలని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కోరింది. ఈ కార్యక్రమంలో హెఎండిఏ డి ఈ విద్యాసాగర్, హెఎండిఏఈ అశుతోష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.