26-08-2025 03:07:16 AM
ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
ముషీరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి) నగరంలో భక్తిప్రపక్తలతో నిర్వహిం చే గణేష్ నవరాత్రి ఉత్సవాలు దైవభక్తి, దేశభక్తిని పెంపొందిస్తున్నాయని ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ లోని హెరిటేజ్ హాల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవసమితి ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ మద్దూరి శివాజీ ఆధ్వర్యం లో నిర్వహించిన సభకు ఎం పీ డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుల, వర్గాలకు అతీతంగా వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాలని సూచించారు.
భాగ్యనగరంలో వైభవంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలు వన్నె తెచ్చాయని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు ఆనాడు ఉద్యమ పోరాటంలో భాగంగా సామూహిక వినాయక మండపాలను ఏర్పాటు చేసి ఉధ్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. గణేష్ మండప నిర్వాహకులు ఇబ్బందులు సృష్టించకుండా ప్రభుత్వ శాఖ అధికారులు అధికారులు నిర్వాహకులకు సహకరించాలని కోరారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తిభావాన్ని పెంపొందించే విధంగా వైభవంగా నిర్వహిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాలన్నారు.
భగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ శశిధర్ మాట్లాడుతూ... భాగ్యనగరంలో లక్షకు పైగా గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించే విధంగా కృషిచేస్తున్నా మన్నారు. ప్రతిరోజు రాత్రి 9గంటలకు వినాయ మండ పాల వద్ద సామూహిక దీపారాదన చేయాలని సూచించారు. హిందువుల ఐక్యతను, దైవభక్తిని చాటి చెప్పాలని పేర్కొన్నారు. అనంతరం గణేష్ నవరాత్రి ఉత్సవ బ్రోచర్ను మద్దూరి శివాజీ అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సికింద్రాబాద్ కన్వీనర్ వినయ్ కుమార్, నియోజకవర్గం ఉత్సవ సమితి నాయకులు శక్తిసింగ్, పరిమళ్ కుమార్, బుర్రా రాజ్ కుమార్, ఎం. నవీన్ గౌడ్, ఆయూష్, బిజ్జి రవి, సలంద్రి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.