calender_icon.png 8 July, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ

03-07-2025 12:00:00 AM

రాజాపూర్ జూలై 2: మండల కేంద్రానికి చెందిన బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ ఆదిత్య బుధవారం తన జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తువులు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి  విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏడాది  సేవా కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ పం చాయతీలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జైపాల్, బీజే పీ మండల అధ్యక్షులు కాటెపాగ ఆనంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ రెడ్డి,తదితరులుపాల్గొన్నారు.