calender_icon.png 31 January, 2026 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ కీ విడుదల

31-01-2026 02:20:43 AM

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)-2026 ప్రాథకిక కీని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ టెట్ పరీక్ష 2026 జనవరి 3 నుంచి 20 వరకు నిర్వహించారు. తెలంగాణ టెట్ ప్రాథమిక కీపై ఫిబ్రవరి 1 వరకు అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం ఇచ్చింది. అభ్యంతరాలను రివ్యూ చేసేందుకు.. పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించింది.

ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి 15 మధ్యలో విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదలతోపాటే ఫైనల్ కీని విడుదల చేస్తారు. వెబ్‌సైట్‌లో కీతోపాటు రెస్పాన్స్ షీట్స్ అందుబాటులో ఉంచారు. ఈసారి టెట్‌కు 2.37 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో దాదాపు 71,670 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు.