calender_icon.png 26 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు డబుల్ ఇళ్ల పంపిణీ

26-09-2025 01:19:17 AM

రసూల్‌పురలో సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఈ నెల 27న రసూల్‌పుర నారాయణ జోపిడిలో 288, సిల్వర్ కాం పౌండ్‌లో 40 మొత్తం 328 నూతన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న సందర్భంగా గురువారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యటించారు. ఎమ్మె ల్యే వెంట జిహెచ్‌ఎంసి హౌసింగ్  సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణా రావు, ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ రవీందర్, డిఈ సంధ్య, ఏఈ మహేష్  ఉన్నారు.

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సభా ప్రాంగణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసు కోవాలని, శాంతి భద్రతల పరిరక్షణ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులకు చెప్పారు. మం త్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కార్యక్రమానికి హాజరవుతున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్, నయీమ్, మల్లేష్, గౌస్, గఫార్, తదితరులు ఉన్నారు.