calender_icon.png 26 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంయుక్త ఫెర్టిలిటీ సొల్యూషన్స్ వార్షికోత్సవం

26-09-2025 01:20:44 AM

మహేంద్రహిల్స్‌లో ఘనంగా నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): సంయుక్త ఫెర్టిలిటీ సొల్యూషన్స్ 2 దశాబ్దాల అనుభవంతో, వైద్య రంగంలో విశ్వసనీయమైన పేరు, తమ మహేంద్ర హిల్స్ శాఖ స్థాపనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కేం ద్రంలో ఐవీఎఫ్, ఐయూఐ, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, ఆధునిక డయాగ్నొస్టిక్స్ వంటి విస్తృత సేవలు ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.

“మూడు సంవత్సరాలు పూర్తవడం మా కోసం ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నాం” అని డా. సంయుక్తరెడ్డి, వ్యవస్థా పకులు  తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందిన ఫెర్టిలిటీ చికిత్సలు అందించడంలో, అలాగే ప్రతి దశలో దంపతుల వ్యక్తిగతమైన మరియు మనస్పూర్తి సహాయాన్ని అందించడంలో మేము అంకిత భావంతో కొనసాగుతాము అన్ని తెలిపారు. మరిన్ని వివరాలకు 7674009066 నంబర్‌లో సంప్రదించాలని చెప్పారు.