26-11-2025 12:00:00 AM
చేగుంట, నవంబర్ 25 :చేగుంట మండలంలోని అనంతసాగర్ గ్రామ పంచాయతీ కార్యాలయ సెక్రటరీ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మ హిళలకు ఇందిరమ్మ చీరలను అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మసాయిపెట్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మహిళల అభ్యున్న తి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి లబ్దిదారుకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని, స్వయం సహాయక సంఘాల ద్వారా మరింత శక్తివంతంగా నిలవాలనే లక్ష్యంతో ఇలాంటి పంపిణీ కార్యక్ర మాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కా ర్యక్రమంలో వివో, విఓఏలు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.