calender_icon.png 26 November, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మారంగంలో పరిశోధనలు.. జాతీయ అభివృద్ధికి అత్యంత కీలకo

26-11-2025 12:00:00 AM

చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ రిజిస్టర్ యం.రవీందర్

మొయినాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఫార్మరంగంలో పరిశోధనలు జాతీయ అభివృద్ధికి అత్యంత కీలకమని చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ రిజిస్టర్ యం. రవీందర్ పేర్కొన్నారు.

మంగళవారం  మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ లో గల చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో ఫార్మసీ విభాగంలో స్రవంతి గండు ‘బయోఅనలిటికల్ మెథడ్ డెవలప్మెంట్ అండ్ వాలిడేషన్ ఫర్ ద డిటెర్మినేషన్ అఫ్ సం  సెలెక్టెడ్ అంటి హైప్ట్రన్సివ్ యాంటీ వైరల్ డ్రగ్స్ అండ్ ఇట్స్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ బై యూపియల్ సీ అండ్ యల్ సీ-యంయస్, యంయస్‌అనే అంశంపై చేసిన పరిశోధన సిద్ధాంతానికి స్రవంతి గండుకు పి.హెచ్.డీ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) లభించగా.. యూనివర్సిటీ చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ రిజిస్టర్ యం. రవీందర్  చేతుల మీదగా ప్రధానం చేశారు.

ఈ పరిశోధన ఆచార్య డాక్టర్ కుమారస్వామి గండ్ల పర్యవేక్షణలో జరిగింది. దీంతో స్రవంతి గండును యూనివర్సిటీ ఛాన్సలర్, ఫౌండర్ డాక్టర్ సిహెచ్.వి.పురుషోత్తం రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్. సాత్విక రెడ్డిలు అభినందించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్టర్ యం.రవీందర్ మాట్లాడుతూ.. ఫార్మసీ విభాగంలో పరిశోధనలు జాతీయ అభివృద్ధికి కీలకమైందని, ఇది యూనివ ర్సిటీ గొప్ప గర్వకారణమన్నారు.

విద్యా పరిశోధన సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని, ప్రజల ఆరోగ్య అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు. చైతన్య యూని వర్సిటీ ఫార్మసి విభాగం సమాజానికి అవసరమైన సృజనాత్మకమైన పరిశోధనలను ప్రోత్సహిస్తూ.. ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. డీన్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆచార్య క్రిస్టోఫర్, అడ్మినిస్ట్రేటివ్ ఆచార్య ఏ.రాజు, జి.కుమారస్వామి, బి.రాజేందర్ రెడ్డి, డాక్టర్ నీలవేణి, డాక్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ రిజిస్టర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి పాల్గొన్నారు.