calender_icon.png 27 August, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ఇంగ్లిష్ పుస్తకాల్లాగే మటన్ సూప్ ఆదరణ పొందాలి

27-08-2025 01:52:47 AM

రమణ్, వర్షా విశ్వనాథ్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ అనేది ట్యాగ్‌లైన్. అలుక్కా స్టూడియోస్, శ్రీవారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్‌చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మించారు.

మంగళవారం ఈ సినిమా నుంచి ‘హర హర శంకర’ గీతాన్ని నటుడు తనికెళ్ల భరణి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. “చికెన్ సూప్ ఫర్ ది సోల్’ అనే పేరుతో ఉండే ఇంగ్లిష్ పుస్తకాలు చాలా ఫేమస్. వాటిలో మనసును హత్తుకునే సాహిత్యం ఉంటుంది. చదివినవారు జీవితంలో మార్పు దిశగా పయనిస్తారు. ఈ ‘మటన్ సూప్’ సినిమా కూడా అలాంటి ఫలితం తీసుకురావాలి.

ఈ సినిమా తీసినవారి, చూసినవారి జీవితాలు మారిపోవాలి” అన్నారు. ‘ఎంతో కష్టపడి ఈ మూవీని తీశాం. ప్రతీ సీన్ జీవితంలో జరిగినట్టుగానే అనిపిస్తుంది. ఈ పాటను వింటుంటూ నాకు కన్నీళ్లు వస్తాయి. ఈ మూవీని సక్సెస్ చేయండి’ అని హీరో రమణ్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతోపాటు నటీనటులు సునీత మనోహర్, గోవింద్ రాజ్ నీరుడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, లైన్ ప్రొడ్యూసర్ కొమ్మా రామకృష్ణ, ఎడిటర్ లోకేశ్ కడలి, మిగతా చిత్రబృందం తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకున్నారు.