27-08-2025 12:00:00 AM
-లారీ డ్రైవర్ల నుంచి అక్రమ దోపిడీ
-చూసీ చూడనట్లు అధికారుల వైఖరి
ములుగు,మంగపేట, ఆగస్టు 26 (విజయ క్రాంతి ): ఇప్పుడు ఏం నడుస్తుంది ఫాగ్ నడుస్తుంది అనే ప్రకటన గుర్తుకొస్తుంది మండలంలోని ఇసుక రీచ్ ల వద్ద రేజింగ్ కాంట్రాక్టర్ల హవా చూస్తుంటే ఇసుక సరఫరాలో అక్రమాలనూ నియత్రించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపకడ్బందీ చర్యలు చేపడుతుంటే దీనికి విరుద్దంగా మండలంలో ఓడగూడెం ఇసుక రిచ్ ల వద్దా వసూళ్ళ పర్వం నడుస్తుంది
ఒక్క లారికి 3500నుండి 4000 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు అని లారీ డ్రైవర్లు వాపోతున్నారు దీనికి తోడు కాంట పార్కింగ్ ఇసుక లేవలింగ్ సీరియల్ అంటూ ఒక్కదానికి ఒక్కొక్క రేటు నిర్ణహించి డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి ఇసుక రిచ్ కాంట్రాక్టర్లు ఇ విదంగా బరితెగించినారు అంటే అధికారుల పర్య వేక్షణ లోపించడం కొందరి అధికారులు సహకారంతో ఇసుక రిచ్ కాంట్రాక్టర్లు నిబంధనలు తుంగలో తొక్కి విరుద్దంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు పిర్యాదులు వసున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి..
నిబంధనలు ప్రకారం ఇసుకను అందించాలి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలకు ఇసుకను అందుబాటులోనికి తెచ్చేందుకు సుమారు 70 యార్డులను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆన్లైన్ ఇసుక బుక్ చేసుకున్న వారికి సీరియల్ ప్రకారం ఇసుకను సరఫరా చేయాలి ప్రస్తుతం వర్షాలకు గోదావరి నది ప్రవహిస్తున్నందున 13 ఇసు క రీచ్‌లు ఆన్లైన్లో నడుస్తున్నాయి టన్నుకు 412 రూపాయలు నిర్దేశించిన రుసుముతో ఆన్లైన్లో బుక్ చేసుకుని డి డీ రూపంలో కేటాయించిన ఇసుకరీచ్ వద్దకు వెళ్లి లారీ డ్రైవర్ డిడిని కాంట్రాక్టర్ కి ఇస్తే రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం లారీ లోడ్ చేయాలి కానీ దానికి భిన్నంగా ఇసుక రీచ్ కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి లారీల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు దీనిని ప్రభుత్వ అధికారులు టీజీఎండిసి మైనింగ్ శాఖరెవిన్యూశాఖ వారు ఇసుక రిచ్ కాంట్రాక్టర్లు లారీల వద్ద నుండి అక్రమంగా వసూలు చేస్తున్న తతంగాన్ని అరికట్టాలని లారీ డ్రైవర్లు యజమానులు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు.