27-08-2025 01:53:56 AM
రవితేజ అభిమానులతోపాటు సి నీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్‌జాతర’. మాస్ మహారాజా కథానాయకుడిగా నటిస్తున్న మైల్‌స్టోన్ 75వ సినిమా ఇది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీలీల ఇందులో కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రం ఆగస్టు 27న థియే టర్లలో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా ప డిం ది. ఇటీవల సినీ కార్మికుల స మ్మె, కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా సినిమాను అనుకున్న తేదీకి తీసుకురాలేక పోతున్నామని నిర్మాతలు అధికారికం గా తెలిపారు. అత్యుత్తమ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్న ట్టు నిర్మాతలు స్పష్టం చేశారు.
ప్రస్తు తం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. త్వరలో ఆశ్చర్యకర కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చా రు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; మాటలు: నందు సవిరిగాన; కెమెరా: విధు అయ్య న్న; ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల.