calender_icon.png 27 August, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం

27-08-2025 12:37:47 AM

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో గర్బస్థ లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారీ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్దారణ చట్టం–1994 పరిధి జిల్లా అడ్వైజరి కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రసన్నకుమారి మాట్లాడుతూ... మన పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 32 స్కానింగ్ కేంద్రాలు పని చేస్తున్నాయని, జిల్లాలో జరిగే ప్రతి స్కానింగ్ కు సంబంధించి ఫారం ఎఫ్ రూపొందించి ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు. 

గర్బస్థ శిశువుగా ఉన్నప్పుడు స్త్రీ, పురుష లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమాన విధించబడు తుందని,అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లింగ నిర్ధారణ అరికట్టుటకు ప్రతి నెల  స్కానింగ్ సెంటర్లను కార్యాలయ సిబ్బంది బృందంతో తనిఖీ నిర్వస్తున్నామని అన్నారు. 

జిల్లాలోని ఆసుపత్రులలో జరుగుతున్న అబార్షన్ కేసులను సైతం స్టడీ చేసి ఎక్కడైనా లింగ నిర్ధారణ కారణంగా అబార్షన్ జరిగిందో పరిశీలిస్తామని డిఎం‌హెచ్ఓ అన్నారు. అధికంగా అబార్షన్ జరిగే ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, డ్రగ్ ఇన్స్పెక్టర్ తో సమన్వయం చేసుకుంటూ అబార్షన్ మాత్రల అమ్మకాలపై పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.