27-08-2025 01:54:55 AM
‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమాలను ఈ సారి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే భాగంగా తెరకెక్కిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే ఏడాది అక్టోబర్ 31న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలకు సన్నాహాలు చే స్తోంది. ప్రభాస్, అనుష్క, రానా, ఇతర తారాగణంతోపాటు దర్శకుడు రాజమౌళి కూడా ప్రమో షన్స్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో ఈ సినిమా టీజర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఆద్యంతం కట్టిపడేస్తున్న ఈ టీజర్ విడుదలైన క్షణాల్లోనే నెట్టింట వైరల్ కావటం విశేషం.